ద్విపాత్రాభినయంలో మోహన్ బాబు విలన్ మరియు హీరోగా
- October 16, 2017
లెజెండరీ నటుడు మోహన్ బాబు కొన్నేళ్లుగా వేగం తగ్గించేశాడు. అప్పుడప్పుడూ మాత్రమే ఓ సినిమా చేస్తున్నాడు. చివరగా 'రౌడీ' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు మోహన్ బాబు. ఆ తర్వాత మామ మంచు అల్లుడు కంచులో కీలకమైన పాత్రలో కనిపించాక మళ్ళీ తెరమీదకి రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమానే.. గాయత్రి. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే 'మేడ మీద అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మోహన్ బాబుతోపాటు అతడి పెద్ద కుమారుడు మంచు విష్ణు ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడని కూడా ఒక న్యూస్. అలానే యాంకర్ అనసూయ జర్నలిస్ట్ పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట. హీరోగా.. విలన్ గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం క్యూరియాసిటీ పెంచే విషయమే.
ఇవి రెండూ నడి వయసు పాత్రలే అంటున్నారు. హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ సినిమాను తీర్చిదిద్దాలని మంచు ఫ్యామిలీ భావిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









