హీరో కాకపోతే రెస్టారంట్ పెట్టుకునే వాడిని అంటున్న బాహుబలి
- October 16, 2017
సినీ పరిశ్రమలో చాలా మంది డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ అయ్యాం అని అంటూ ఉంటారు. కొంతమంది నటీ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నాక.. తమ డబ్బులను వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి.. ఆర్ధిక భద్రతను కల్పించుకొంటారు.. ముఖ్యంగా ఎక్కువ మంది సెలబ్రిటీలు రెస్టారెంట్స్ ని ఓపెన్ చేసి వ్యాపార రంగంలో అడుగు పెడుతున్నారు.. కాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రభాస్ మాత్రం సినిమాల్లో నటించాలని అనుకోలేదట... సినిమాల్లోకి రాకముందు ఓ హోటల్ బిజినెస్ ను పెట్టుకుందామని ప్రభాస్ అనుకున్నాడట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పాడు.. తన పర్సన్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకొన్న ప్రభాస్... హీరోగా నటించమని.. రెండు మూడు సార్లు ఇంట్లో వాళ్ళు అడిగినా ప్రభాస్ మాత్రం కుదరదు.. ఇంట్లో వారంతా.. భోజన ప్రియులు కనుక తాను ఓ రెస్టారెంట్ బిజినెస్ చేయాలని భావించినట్లు ప్రభాస్ చెప్పాడు. అయితే ఓ సారి కృష్ణం రాజు హీరోగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు పాత్రలో ప్రభాస్ తనని తాను ఊహించుకొన్నట్లు.. అప్పటి నుంచి హీరో కావాలని అనుకున్నట్లు చెప్పాడు.. కానీ తాను హీరో అవుతానని చెప్పినా స్నేహితులు కానీ, ఇంట్లో వారు కానీ నమ్మలేదని తెలిపాడు.. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు నమ్మి సినిమాల్లో హీరోగా నటించడానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు ప్రభాస్ చెప్పాడు.. ఆ స్నేహితుడే నిర్మాతగా మారి..మిర్చి సినిమా తీశాడు.. ఇప్పుడు సాహో కి కూడా అతనే నిర్మాత అని ప్రభాస్ చెప్పాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!









