రూ.78వేల కోట్లతో చైనా బీజింగ్‌లో భారీ విమానాశ్రయం

- October 16, 2017 , by Maagulf
రూ.78వేల కోట్లతో చైనా బీజింగ్‌లో భారీ విమానాశ్రయం

ప్రపంచంలోనే అతిపెద్దవాటిల్లో ఒకటిగా నిలిచిపోయేలా విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టిన చైనా- దానికి సంబంధించిన సవివర ప్రణాళికను సోమవారం ఆవిష్కరించింది. దీని నిమిత్తం 12.14 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.78,900 కోట్లు) ఖర్చు చేస్తున్నారు. 2014లోనే నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2019 అక్టోబరులో దీనిని ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయం ఏటా 4.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలు కల్పిస్తుంది. క్రమేణా ఈ సామర్థ్యాన్ని 10 కోట్లకు చేరుస్తారు. ఉక్కుతో తయారైన ఓ భారీ పుష్పం ఆకృతిలో ఉండే ఈ విమానాశ్రయం చైనా జాతీయ ఉత్పాదక సామర్థ్యానికి ప్రబల తార్కాణంగా నిలిచిపోతుంది. దశాబ్ద కాలంలో రెండుసార్లు జరిగే అధికార కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలు ఈ వారంలో మొదలవనున్నాయి. జిన్‌పింగ్‌ తన పదవీకాలంలో తొలి ఐదేళ్లలో విజయవంతంగా చేపట్టిన ఇలాంటి పనుల గురించి ఈ సమావేశాల్లో వివరించనున్నారు. ఈ విమానాశ్రయం బీజింగ్‌కు 67 కి.మీ. దూరంలో రాబోతోంది. బీజింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉన్న ఒత్తిడిని ఇది గణనీయంగా తగ్గించనుంది.

ప్రయాణికుల సంఖ్య పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com