ఒఫెలియా హరికేన్ తుఫాన్ ఐర్లండ్‌ను సోమవారం తాకింది
- October 16, 2017
- 'స్టాటస్ రెడ్' ప్రమాద హెచ్చరిక జారీ
- పాఠశాలలకు సోమవారం సెలవు
ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఒఫెలియా తుఫాను ఐర్లండ్‌ను వణికించింది. ఈ తుఫాన్ ఐర్లండ్‌ను సోమవారం తాకింది.దీంతో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అట్లాంటిక్ సముద్రంలోని తూర్పు ప్రాంతంలో ఇప్పటి వరకు ఇంతటి పెద్ద హరికేన్ సంభవించినట్లు చరిత్రలో నమోదు కాలేదు. ఐర్లండ్ వాతావరణ పరిశోధన సంస్ధ ఎయిరీన్ 'స్టాటస్ రెడ్' ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఒఫెలియా హరికేన్ సోమవారం పగటి సమయంలో వస్తున్నందువల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని ముందుగానే హెచ్చరించింది. దీంతో సోమవారం పాఠశాలలు మూసి వేయాలని విద్యా శాఖను ప్రభుత్వం ఆదేశించింది.. ఐర్లండ్‌కు పశ్చిమ తీరాన ఉన్న చల్లటి సముద్రాల దిశగా హరికేన్ ఒఫెలియా ప్రయాణిస్తూ బలహీన పడుతున్నప్పటికీ, విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ పరిశోధన శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







