వలస కార్మికుల సమస్యలపై యూఏఈతో కలిసి పనిచేస్తున్న ఇండియా
- October 17, 2017
యూఏఈలో రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సంబంధించి ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ, యూఏఈతో కలిసి ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ, ఆయా వ్యక్తులను సమస్యల నుంచి గట్టెక్కిస్తోందని యూఏఈలో ఇండియన్ అంబాసిడర్ నవదీప సూరి చెప్పారు. డొమెస్టిక్ వర్కర్స్ కోసం షెల్టర్ ఏర్పాటు చేశామనీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపడ్తున్నామని ఆయన తెలిపారు. యూఏఈ చట్టాలపై అవగాహన లేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నవారికి అవగాహన కల్పిస్తున్నామని వివరించారాయన. వరల్డ్ స్కిల్ కాంపిటీషన్‌లో ఇండియా పెవిలియన్‌ని అంబాసిడర్ సూరి ప్రారంభించారు. 77 మంది సభ్యులుగల స్ట్రాంగ్ కంటిగ్నెంట్ బృందాన్ని దీనికోసం ఏర్పాటు చేసింది. 2009లో ఇండియా సిల్వర్ మెడల్స్‌ని సాధించింది. 2015లో 5 మెడలియన్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని సాధించింది. ఇటీవలి కాలంలో తమ పెర్ఫామెన్స్ బాగా పెరగిందనీ, గోల్డ్ సాధించే అవకాశాలు మెరుగుపర్చుకున్నిమని సూరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







