కారుబాంబు.. పొలాల్లో ముక్కలై పడిన జర్నలిస్టు డాదప్నే కార్వానా గలిజియా
- October 17, 2017
పనామా కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనే జర్నలిస్టును చంపేశారు. ఆమె ప్రయాణించే కారులో బాంబు పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి కారు వేసుకొని బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు పేలి పోవడంతో ఆమె దేహం విడిపోయిన భాగాలుగా పొలాల్లో పడిపోయింది. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో పనామా కుంభకోణం ఓ కుదుపు కుదిపిన విషయం తెలసిందే.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కూడా ఈ కుంభకోణం కారణంగానే ఊడిపోయింది. అలాగే, పలు అగ్ర దేశాల అధినేతలు సైతం ఈ కుంభకోణం ద్వారా వెలుగులోకి వచ్చారు. అలాంటి పనామా కేసులో గలిజియా విచారణ విభాగంలో మాల్టాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన భర్త పిల్లలతో కలిసి మోస్టా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆమె కొద్ది సెకన్లకే బాంబు పేలుడుకు గురైంది. ఆమె కారుతో సహా ఎగిరిపోయి పొలాల్లో పడిపోయారు. ఆమె దేహం పూర్తిగా కాలి చిద్రమై పోయింది. ఆమె దుర్మరణంపట్ల మాట్లా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ సంతాపం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, పనామా కేసు విచారణలో భాగస్వామురాలైన ఆమె ప్రధాని ముస్కాట్ భార్య, విద్యుత్‌శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారని కథనాలు వెలువరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







