కీర్తి పుట్టిన రోజు కానుకగా 'మహానటి' ఫస్ట్ లుక్
- October 17, 2017
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "మహానటి". ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అలనాటి నటి మేనక కూతురు కీర్తి సురేష్ నటిస్తున్నది.. కాగా ఈ రోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా కీర్తి కి శుభాకాంక్షలు చెబుతూ మహానటి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ ఫస్ట్ లుక్ లో పాతకాలం నాటి ఫోటో లో కీర్తి సురేష్ కళ్ళను మాత్రమే చూపించారు. ఫోటో చూడగానే సావిత్రి ఈమే అని అనిపించేంతగా ఒదిగి పోయింది అనిపిస్తుంది.. ఆ కళ్ల ఫోటో చూస్తుంటే.. కీర్తి కళ్ళు.. అచ్చం సావిత్రి లాగే కనిపిస్తున్నాయి.. చిత్రం బృందం ఈ ఫోటో ని రిలీజ్ చేస్తూ.. ఆకాశ వీధిలో అందాల జాబిలి అనే కాప్షన్ కూడా ఇచ్చారు.. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతూ.. సావిత్రా లేక కీర్తి నా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.. సావిత్రి భర్త జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్, జర్నలిస్ట్ గా సమంత, విజయ్ దేవర కొండ, షాలిని పాండే, మోహన్ బాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







