త్వరలో రానున్న బోయపాటి తో సినిమాకు చరణ్
- October 17, 2017
రామ్ చరణ్ ఇటీవల సరికొత్త నేపద్య కథలను ఎంచుకొంటున్నాడు. ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అలా వచ్చిందే ధృవ మూవీ. ఈ మూవీతో రామ్ చరణ్ ఓ మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ రంగస్థలం 1985. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో చరణ్ డిఫరెంటు లుక్ లో కనిపిస్తున్నాడు. దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
రంగస్థలం 1985 తర్వాత, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు చరణ్. ఈ మూవీని తన సొంత ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మించబోతున్నాడు. సంక్రాంతి తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అయితే లేటెస్ట్ గా రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి చాన్స్ ఇచ్చాడనే వార్త హల్ చల్ చేస్తోంది. ఒకవేళ ఇచ్చినా కొరటాలతో చేసే సినిమా కంప్లీట్ అయ్యేదాక వెయిట్ చేయాల్సి ఉంది. కాగా ఈ వార్త పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







