చైతూని ఓడించిన సమంత..!
- October 17, 2017
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినీ ఆ జంట గురించే కామెంట్..అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య తన సహనటి అందాల భామ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి.. అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో రెండు రకాలుగా పెళ్లి చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. ఈ పెళ్లి సందడి లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా బాగా హడావిడి చేశారు.
అన్నయ్య పెళ్లికి అఖిల్ అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకుంటూ వదినను ఇంప్రెస్ చేశాడు. పెళ్లికి కుటుంబసబ్యులతో పాటు 100 మంది సనిహితులే హాజరయ్యారు. కాకపోతే అభిమానులకు, ముఖ్యంగా సినీపరిశ్రమలోని వేలాదిమందికి ఆ వేడుక చూసే అవకాశం లేకపోయింది. అప్పటికీ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. మరోవైపు సమంత, మామ నాగార్జున సహా పలువురు పెళ్లి పోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు.
తాజాగా వీరి పెళ్లికి సంబందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చైతూ, సమంత తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్న సమయంలో బిందెలో ఉంగరం తీసే ఆట ఇద్దరు ఆడుతుంటే చుట్టు ఉన్నవారు ఇద్దరినీ ఆటపట్టిస్తూ ఉన్నారు.
పురోహితుడు.. బిందెలో ఉంగరం వెయడం ఇద్దరు పొటీపడి మరి ఉంగరం తీసే ప్రయత్నంలో , రెండు సార్లు ఆటలో సమంతనే గెలించింది. మరి తన ప్రియురాలి కోసం చైతూ ఇలా చేశాడా..లేదా సమంత తన తెలివితో చైతూని చిత్తు చేసిందా ఆ కొత్త జంటకే తెలియాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







