పవర్ స్టార్ నటిస్తున్న'అజ్ఞాతవాసి' సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్
- October 17, 2017
గ్లామర్, పెర్ఫార్మెన్స్...రెండూ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తూ పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై బ్యూటీ, ఆ తర్వాత తమిళ్, తెలుగు బాషల్లోనూ క్రేజీ ఆఫర్లతో పాటు స్టార్ డమ్ కూడా సంపాదించుకుంది. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా అజ్ఞాతవాసి మూవీలో మెరవనుంది.
రామ్ నటించిన నేను శైలజ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ . ప్రేమకథా చిత్రంగా వచ్చిన నేను శైలజ, బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడంతో పాటు కీర్తి సురేష్‌కి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. దీంతో తెలుగులో కీర్తి సురేష్ కి వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగులో నేను శైలజ తర్వాత కీర్తి సురేష్ నటించిన చిత్రం నేను లోకల్. నేచురల్ స్టార్ నానికి జోడీగా ఈ మూవీలో నటించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్ హిట్ అయిన నేను లోకల్ కీర్తి సురేష్‌కు మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది.
నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయకముందే, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఇమేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. గీతాంజలి చిత్రంతో మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ తర్వాత మలయాళంలో మరో రెండు సినిమాలు చేసి, తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇదు ఎన్న మాయమ్, రజనీ మురుగన్, రెమో, భైరవచిత్రాలతో తమిళ్ లో స్టార్ డమ్ సంపాదించుకుంది.
వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి మంచి హిట్స్ తో దూసుకుపోతున్న కీర్తి సురేష్, ప్రజెంట్ టాప్ హీరోయిన్లలో ఒకరు. సమంత, రకుల్, కాజల్, నయనతార లాంటి స్టార్డమ్ ఉన్నా కీర్తి సురేష్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. తమిళ్లో విక్రమ్, సూర్య, విశాల్ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్, బైలింగ్వల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక్ మహానటిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మహానటిలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తుండటం విశేషం.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. అజ్ఞాతవాసి అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ మూవీని, భారీ బడ్జెట్‌తో హారికా అండ్ హాసినీ సంస్థలో రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇండస్ట్రీలో భారీ హైప్ ఉన్న ఈ మూవీలో నటిస్తుండటంతో, కీర్తి సురేష్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ తర్వాత తెలుగులో తనకు మరిన్ని క్రేజీ ఆఫర్స్ తో పాటు సక్సెస్ సినిమాలతో దూసుకెళ్లాలి. ఆల్ ది బెస్ట్ కీర్తి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







