సైనికులతో దీపావళి జరుపుకోనున్న మోడీ
- October 19, 2017
వరుసగా నాలుగో ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమో డీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకోనున్నారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్ వద్ద పహారా కాస్తున్న సైనికులను మో డీ కలుసుకొని దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి ఆయన ఉరీ సెక్టార్లో కూడా పర్యటించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దేవ్‌రాజ్ అన్బు తదితరులు మో డీ వెంట ఉండనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మో డీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసే జరుపుకొంటున్నారు. 2014లో సియాచిన్‌లో సైనికులతో జరుపుకోగా.. 2015లో అమృత్‌సర్‌లోని డొగ్రాయ్ వార్ మెమోరియల్‌ను సందర్శించి అక్కడ జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు. గతేడాది మో డీ దీపావళి వేడుకలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బందితో కలిసి చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఉత్తరఖాండ్‌లోని చమోలి వెళ్లి అక్కడ ఐటీబీపీ జవాన్లను కలిశారు. వారికి మిఠాయిలు తినిపించి ఆనందంగా వేడుకలు చేసుకున్నారు.




తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







