శ్రీముఖి వల్లే యాంకర్‌గా కొనసాగుతున్నా: బుల్లి తెర యాంకర్ రవి
- October 19, 2017
బుల్లి తెర యాంకర్ రవి ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ ఆడయో ఫంక్షన్ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు రవి సూపర్ అంటూ మద్దతు తెలపడం ఈ వివాదానికి కారణమైంది. పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మహిళా సంఘాలు వారిద్దరిపై కేసులు కూడా నమోదు చేశాయి. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వంగా చేసినవి కావని రవి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు. ఆ సమయంలో ఇంట్లో వారితో పాటు, ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న వేసేవారని దీంతో యాంకరింగ్ నించి విరమించుకోవాలనుకున్నానని రవి చెప్పాడు. అయితే ఆ సమయంలో తోటి యాంకర్లు శ్రీముఖి, సుమ, ప్రదీప్ అండగా నిలిచారని, మేం కూడా ఇలాంటివి ఎదుర్కున్నామని అంత మాత్రం చేత యాంకేరింగ్ నించి విరమించుకోవద్దని ధైర్యం చెప్పారన్నారు. ఆ సమయంలో శ్రీముఖి ఇచ్చిన సపోర్ట్ నన్ను మళ్లీ మీ ముందు యాంకర్‌గా నిలబెట్టిందని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









