బాల్కనీలోంచి కిందికి పడి నాలుగేళ్ళ చిన్నారి మృతి
- October 20, 2017
షార్జాలోని అల్ తావున్ ప్రాంతంలోగల ఓ భవనం నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి నాలుగేళ్ళ బాలిక మృతి చెందింది. ఆడుకుంటూ బాల్కనీలో ఉన్న కుర్చీ మీదకు ఎక్కి, అక్కడి నుంచి కిందపడిపోయినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి సీఐడీ అధికారులు, ఫోరెన్సిక్ మరియు పెట్రోల్స్‌ని పంపించామనీ, అంబులెన్స్ అక్కడికి చేరుకునేటప్పటికే రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న చిన్నారి కన్పించిందని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. అల్ బుహైరా పోలీస్ స్టేషన్, ఈ కేసు విచారణ చేపట్టింది. విచారణ నిమిత్తం మృతురాలి తల్లిదండ్రుల్ని పోలీసులు పిలవనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







