యు. ఏ . ఈ. కొత్త వీసా ప్రక్రియలో మినహాయింపులు లేవు
- November 05, 2015
ఈ నవంబరు 15 నుండి యు. ఏ . ఈ. లో కొత్త వీసా ప్రక్రియలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండబోవని జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్(GDRFA) వారు స్పష్టం చేసారు. వారు గత నెల వీసా లావాదేవీల ప్రక్రియ కోసం కొత్త ప్రక్రియను ప్రవేసపెట్టిన సంగతి విదితమే. యు. ఏ . ఈ., జి. సి.సి. దేశీయుల కోసం 'విజన్' అనే పేరుగల అందరు కొత్త దరఖాస్తుదారులు తమ అసలు సర్టిఫికెట్లను స్కానింగ్ కోసం సమర్పించ వలసి ఉంటుందని, ఇప్పుడు గ్రేస్ పీరియడ్ లో ఉన్నామని, నవంబర్ 15 నుండి ఇది తప్పనిసరి కాబోతోందని, పాత మరియు పరిశీలనలో ఉన్న దరఖాస్తు లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ కొత్త దరఖాస్తు దారులు తమ అసలు పత్రాలను స్కానింగ్ కై సమర్పించవలసి ఉంటుందని, వారు వీసా దరఖాస్తుల కోసం టైపింగ్ సెంటర్లకు వెళ్ళినపుడు ఈ కింది పత్రాలను వెంట తీసుకు వెళ్లాలని వారు సలహా ఇచ్చారు:స్పాన్సరర్ యొక్క ఒరిజినల్ పాస్ పోర్టు మరియు ఎమిరేట్స్ ఐ. డి. ,.స్పాన్సర్ చేయబడుతున్న వారి యొక్క ఒరిజినల్ పాస్ పోర్టు మరియు ఎమిరేట్స్ ఐ. డి., స్పాన్సర్ చేయబడుతున్న వారి యొక్క కలర్ ఫోటో - తెలుపు బ్యాక్ గ్రౌండ్ లో, లేబర్ కాంట్రాక్ట్, లేబర్ కార్డు, ప్రైవేటు రంగంలో ఉన్న వారికీ శాలరీ లెటర్, ఫ్రీ జోన్, గవర్నమెంట్, స్పాన్సర్ పార్టనర్ లేదా ఇన్వెస్టర్ ఐనట్లితే -ట్రేడ్ లైసెన్స్, ఒరిజినల్ టెనేన్సీ కాంట్రాక్ట్, వర్తించే వారికీ జనన మరియు వివాహ సర్టిఫికెట్లు, మరియు స్పాన్సర్ యొక్క IBAN నంబరు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







