స్కూల్ బస్సులో నిద్రించిన బాలికను రేప్ చేయబోయిన డ్రైవర్
- October 20, 2017
అజ్మాన్, యూఏఈ : రోజూ బస్సులో పాఠశాలకు ఆ బాలికను తీసుకువెళ్లే ఓ డ్రైవర్ దుర్మార్గానికి పరాకాష్ట ఇది ఇటీవల స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో 8 ఏళ్ల వయసున్న ఓ బాలిక బస్సులోనే నిద్రపోయింది. నిద్రపోతున్న బాలికను ఇంటి వద్ద ఆ బస్సు డ్రైవర్ దించలేదు. పిల్లలందరూ దిగిపోయిన తర్వాత బస్సును తీసుకెళ్లి తన ఇంటిముందు పెట్టాడు. బాలికపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడి చర్యలతో నిద్రలేచిన బాలిక ఏం చేయవద్దంటూ బతిమాలింది. ఇంటికి పంపించాలని కోరింది. బాలికపై ఎలాగైనా దాడి చేయాలని భావించిన మానవరూప మృగం బాలికను బస్సులోనే ఉంచి తాళం వేసి ఇంట్లోకి వెళ్లాడు. తర్వాత వచ్చి తన కోర్కెను తీర్చుకోవాలని భావించాడు. తీవ్రంగా భయపడిన బాలిక బస్సులో భయంభయంగా అటూఇటూ చూస్తూ గడుపుతుండగా.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి బాలికను గమనించాడు. అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరిన పోలీసులు కిటీకి అద్దాలు పగులగొట్టి బాలికను రక్షించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. బస్లో భద్రత చూసుకునే వ్యక్తి లేకపోవడం, స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో ఎలాంటి కెమేరాలు లేకపోవడంపై దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తివివరాలు తెలియాల్సి వుందని అజ్మాన్ డైరెక్టర్ ఆఫ్ ఆఫ్ పోలీసు అల్ జబార్ అల్ షామ్సీ తెలిపారు. బాలికపై అత్యాచారం జరగలేదని, బాలిక తీవ్రభయానికి గురైందని, సైక్రియాటిస్ట్తో వైద్యమందిస్తున్నామని తెలిపారు. నిందితుడు అజ్మాన్కు వలస వచ్చిన వ్యక్తని, ఆసియాలోని ఓ దేశానికి చెందిన వ్యక్తని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







