గూగుల్ యాప్స్ లో బగ్ కనుక్కుంటే 1000 డాలర్లు!
- October 20, 2017
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓ కొత్త ప్రకటన చేసింది. సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లు ఆండ్రాయిడ్ యాప్స్‌లో బగ్స్‌ని కనుక్కుని గూగుల్ పరిశోధకులకు సమాచారం అందిస్తే వారికి 1000 డాలర్లు(దాదాపు రూ.65,000) రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌లో బగ్స్‌ను కనుక్కుని మెరుగైన సేవలు అందించే సెక్యూరిటీ పరిశోధకుల కోసం ఈ రివార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని గురువారం గూగుల్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇందుకోసం గూగుల్ 'హ్యాకర్ వన్' అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ యాప్స్ తయారుచేసే ప్రతీఒక్కరూ ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని సూచించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా యాప్ సెక్యూరిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని దీనివల్ల డెవలపర్లకు లాభం చేకూరుతుందని గూగుల్ పేర్కొంది.
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 4.4 వంటి డివైస్‌లలో ఆర్‌సీఈ(రిమోట్ కోడ్ ఎక్సిక్యూషన్), పీవోసీ(ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్) విషయాలపై దృష్టిపెడుతున్నట్లు తెలిపింది. 'కేవలం యాప్‌ల గురించే కాదు ఎకోసిస్టమ్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. అని గూగుల్ ప్లే యాప్స్ డైరెక్టర్ వినీత్ తెలిపారు.
అయితే ఈ ప్రోగ్రామ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అన్న విషయాలు మాత్రం గూగుల్ వెల్లడించలేదు. ఈ బగ్ ప్రోగ్రామ్‌ని గూగుల్ 2015 జూన్‌లో ప్రారంభించింది. మొదటి రెండేళ్లలోనే వచ్చిన వందల కొద్ది బగ్ నివేదికలకు గానూ గూగుల్ 1.5 మిలియన్ డాలర్లు వెచ్చించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







