స్కూల్ బస్సులో నిద్రించిన బాలికను రేప్ చేయబోయిన డ్రైవర్

- October 20, 2017 , by Maagulf
స్కూల్ బస్సులో నిద్రించిన బాలికను రేప్ చేయబోయిన డ్రైవర్

అజ్మాన్, యూఏఈ : రోజూ బస్సులో పాఠశాలకు ఆ బాలికను తీసుకువెళ్లే ఓ డ్రైవర్ దుర్మార్గానికి పరాకాష్ట ఇది  ఇటీవల  స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో 8 ఏళ్ల వయసున్న ఓ బాలిక బస్సులోనే నిద్రపోయింది. నిద్రపోతున్న బాలికను ఇంటి వద్ద ఆ బస్సు డ్రైవర్ దించలేదు. పిల్లలందరూ దిగిపోయిన తర్వాత బస్సును తీసుకెళ్లి తన ఇంటిముందు పెట్టాడు. బాలికపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడి చర్యలతో నిద్రలేచిన బాలిక ఏం చేయవద్దంటూ బతిమాలింది. ఇంటికి పంపించాలని కోరింది. బాలికపై ఎలాగైనా దాడి చేయాలని భావించిన మానవరూప మృగం  బాలికను బస్సులోనే ఉంచి తాళం వేసి ఇంట్లోకి వెళ్లాడు. తర్వాత వచ్చి తన కోర్కెను తీర్చుకోవాలని భావించాడు. తీవ్రంగా భయపడిన బాలిక బస్సులో భయంభయంగా అటూఇటూ చూస్తూ గడుపుతుండగా.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి బాలికను గమనించాడు. అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరిన పోలీసులు కిటీకి అద్దాలు పగులగొట్టి బాలికను రక్షించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. బస్‌లో భద్రత చూసుకునే వ్యక్తి లేకపోవడం, స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో ఎలాంటి కెమేరాలు లేకపోవడంపై  దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తివివరాలు తెలియాల్సి వుందని అజ్మాన్ డైరెక్టర్ ఆఫ్ ఆఫ్ పోలీసు అల్ జబార్ అల్ షామ్సీ తెలిపారు. బాలికపై అత్యాచారం జరగలేదని, బాలిక తీవ్రభయానికి గురైందని, సైక్రియాటిస్ట్‌తో వైద్యమందిస్తున్నామని తెలిపారు. నిందితుడు అజ్మాన్‌కు వలస వచ్చిన వ్యక్తని, ఆసియాలోని ఓ దేశానికి చెందిన వ్యక్తని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com