మరో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడతా అంటున్న శ్రీశాంత్ .!
- October 20, 2017
'నాపై నిషేధం విధించింది బీసీసీఐ మాత్రమే ఐసీసీ కాదు.. కాబట్టి నేను మరో దేశానికి వెళ్లి ఆ దేశం తరఫున క్రికెట్ ఆడతా' అని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ తెలిపాడు. తాజాగా కేరళ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీశాంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'నా పై బీసీసీఐ మాత్రమే నిషేధం విధించింది. ఐసీసీ కాదు కదా. కాబట్టి భారత్‌లో కాకపోతే మరో దేశానికి వెళ్లి ఆ దేశం తరఫున క్రికెట్ ఆడతా. నా వయసు 34. మహా అయితే మరో ఆరేళ్లు నేను ఆడగలను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా క్రికెట్ ఆడాలన్నది నా కోరిక' అని శ్రీశాంత్ తెలిపాడు.
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగాలపై బీసీసీఐ.. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో బోర్డు చర్యలను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ శ్రీశాంత్‌ను క్రికెట్లో పునరాగమనం చేసేందుకు బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో అతను మరోసారి కోర్టును ఆశ్రయించాడు. అందులో భాగంగా కోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సవాలు చేయడంతో కోర్టు జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో శ్రీశాంత్ కెరీర్‌కు మళ్లీ ఫుల్‌స్టాప్ పడినట్లైంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







