చంద్రునిపై భారీ గుహను జపాన్ అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు
- October 21, 2017
చంద్రునిపై భారీ గుహను జపాన్ అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. రాబోయే కాలంలో చంద్రునిపై ఆవాసం ఏర్పరుచుకోవాలని చేస్తున్న మానవ ప్రయత్నాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. చంద్రునిపై ప్రమాదకరమైన రేడియేషన్, ఉష్ణోగ్రతల మార్పుల నుంచి ఈ గుహ వ్యోమగాములను రక్షిస్తుందని.. వారికి ఆవాసంగా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. జపాన్‌కు చెందిన సెలెన్ లూనార్ ఆర్బిటర్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా చంద్రునిపై భారీ గుహ ఒకటి ఉన్నట్లు గుర్తించారు. ఇది 50 కిలోమీటరర్ల పొడవు.. 100 మీటర్ల వెడల్పు ఉన్నట్లు అంచనా వేశారు. చంద్రునిపై అగ్నిపర్వత విస్పోటనం ద్వారా వచ్చిన లావాతో ట్యూబ్ మాదిరిగా ఇది ఇది ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఇది 3.5 బిలియన్ ఏళ్ల క్రితమే ఏర్పడి ఉంటుందన్నారు.
వీటికి సంబంధించిన పరిశోధనలు యూఎస్ సైన్స్ మ్యాగ్జైన్ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







