బరువు పెరగడానికి 10 ఆరోగ్యసుత్రాలు
- November 05, 2015
స్థూలకాయంతో బాధపడే వాళ్ల సంగతి ఒక ఎత్తైతే.. బక్కపల్చగా ఉన్న శరీరంతో బాధపడేవాళ్ల సంగతి మరో ఎత్తు. బరువున్న వాళ్లు కొవ్వు కరిగించుకోవడానికి తీవ్రంగా ట్రై చేస్తుంటే.. లావు పెరగడానికి తెగ ప్రయత్నిస్తుంటారు సన్నగా ఉన్నవాళ్లు. అయితే బరువు పెరగడానికి ఏది పడితే అది తినేస్తే.. రిస్క్ లో పడతారు. కాబట్టి.. ఏవి తినాలి.. ఏవి తినకూడదో తెలుసుకుని తింటే బెటర్. వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి... బరువు పెరగడం అంత తేలికైన విషయం కాదు. ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోకపోతే.. చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమౌతాయి. సులభమైన మార్గాల ద్వారా.. ఆరోగ్యంగా బరువును ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.. శక్తిని అందించే ఆహార పదార్థాలు డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, అవకాడో, గింజలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు పెరగడానికి ఇవి తోడ్పడతాయి. టైంకి తినడం చాలా అవసరం. సమయానికి భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం చేయాలి. ఆలస్యంగా తినడం మంచిది కాదు. ఏ సమయంలో ఏం తినాలి అని ఒక ప్రణాళిక రూపొందించుకుని ఫాలో అయితే బెటర్. డ్రై ఫ్రూట్స్ రుచికరంగానే కాదు.. తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. కాబట్టి బాదం, కాజూ, ఎండుద్రాక్ష తీసుకోవాలి. వీటిని డైరెక్ట్ గా అయినా.. ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు. కొంచెం కొంచెం తినడం వల్ల బరువు పెరగలేరు. కాబట్టి.. తీసుకునే ఆహారంలో పరిమాణం పెంచండి. ఎక్కువ పరిమాణంలో ఒకేసారి తినలేం అని ఫీలయ్యేవాళ్లు.. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తింటే సరిపోతుంది. రెండు, మూడు గంటలకొకసారి తినడం వల్ల క్యాలరీల స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి.. సాయంకాలం లేదా అప్పుడప్పుడు చిరుతిళ్లు తీసుకోవాలి. పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. పండ్లు తక్షణ శక్తితో పాటు.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. కాబట్టి.. పండ్లను డైట్ లో చేర్చుకోవాలి. అరటిపండు లాంటివి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. పండ్లు ఇష్టపడని వాళ్లు.. జ్యూస్ రూపంలో తాగితే సరిపోతుంది. తాజాగా ఇంట్లో చేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మాంసం, చేపలు, యోగర్ట్, బీన్స్ వంటి వాటిల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వీటిని డైట్ లో చేర్చుకోవాలి. ఇవి శరీర బరువు పెరగడానికి తోడ్పడతాయి. రోజుకి 5 వందల క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వారానికి ఒక పౌండ్ బరువు పెరగుతారు. ఆహారం తయారు చేసేటప్పుడు వెన్న, చీజ్ లు కలిపితే.. ఎక్కువ మోతాదులో ఈజీగా క్యాలరీలు పెరుగుతాయి. మొక్కజొన్నలు, బఠానీలు కూడా బరువు పెరగడానికి తోడ్పడతాయి. సన్నగా ఉన్నాం కదా వ్యాయామం ఎందుకులే అనుకుంటారు చాలామంది. కానీ.. బరువు పెరగడానికి బలమైన కండర నిర్మాణం ప్రధానమైనది. క్యాలరీలు తీసుకోటాన్ని పెంచినప్పుడు మీ శక్తి వినియోగం కూడా అంతే మొత్తంలో ఉండాలి. ఈ పద్దతి ద్వారా బరువుతో పాటు.. ఆరోగ్యం బాగుంటుంది. బరువు పెరగాలన్న ఆశతో.. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లపై మోజు పెంచుకోకూడదు. వీటిలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. హెల్తీ ఫుడ్స్ ఎంచుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.. ఆరోగ్యంగానూ ఉండవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







