నిద్ర ఎక్కువైనా, తక్కువైనా వీర్యానికి ఇబ్బందే.!
- October 21, 2017
నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్ (యాంటీస్పెర్మ్ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం.. వదులుగా ఉండే దుస్తులు ధరించటం..వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







