సంఘమిత్ర' టైటిల్ రోల్‌లో దిశా పటానీ
- October 21, 2017
ఎట్టకేలకు 'సంఘమిత్ర' టైటిల్ రోల్‌లో నటించేందుకు కథానాయిక దొరికింది. 'లోఫర్' ముద్దుగుమ్మ దిశా పటానీ సంఘమిత్ర టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 'సంఘమిత్ర అందాల యువరాణి దొరికింది. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది' అని తమిళ నటి కుష్బు ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో జయం రవి, ఆర్య తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్రీతేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సుందర్.సి దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ చిత్రం 'సంఘమిత్ర'. తొలుత ఇందులో టైటిల్ రోల్‌లో శ్రుతిహాసన్ నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రుతిహాసన్ ఈ చిత్రం నుంచి వైదొలిగింది. దీంతో అప్పటి నుంచి సంఘమిత్ర యువరాణిగా ఎవరు నటిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. హన్సిక, అనుష్క, నయనతార పేర్లు వినిపించినప్పటికీ చివరికి దిశా పటానీకి ఆ అవకాశం దక్కింది. 'లోఫర్' చిత్రంలో మెగా వారసుడు వరుణ్‌తేజ్ సరసన దిశాపటానీ నటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







