క్యాన్సర్ భాదితులకు విగ్గులు కొరకు అబూధాబీ మహిళలు జుట్టు దానం

- October 21, 2017 , by Maagulf
క్యాన్సర్ భాదితులకు విగ్గులు కొరకు అబూధాబీ మహిళలు జుట్టు దానం

అబూధాబీ : సాయం చేయాలనే మనస్సు ఉంటె... అవయవ దానమే చేయనక్కరలేదని అబూధాబీలో నివసిస్తున్న ప్రవాసియ మహిళలు నిరూపించారు. స్త్రీలకు ఎంతో ప్రియమైన కురులను కత్తిరించి క్యాన్సర్ రోగులకు విగ్గులు తయారుచేయడానికి అందచేయడం సాధారణ విషయం కాదు.  కీమోథెరపీకి  కారణంగా జట్టు కోల్పోయిన క్యాన్సర్ రోగులకు సంఘీభావం తెలియచేస్తూ  అబూధాబీ నుండి 15 మంది మహిళలు తమ జుట్టును విరాళంగా ఇచ్చారు. మార్టో మారియం సమాజం మహిళా విభాగం  సెయింట్ జార్ఖండ్ సిరియస్ సింహసనా కేథడ్రాల్ అల్ ఐన్ లో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు, వీరిలో అనేకమంది తమ  భావాలను వ్యక్తపర్చారు , "ఇది తమకు ఒక వార్షిక కార్యక్రమంగా ఉందని , మేము రక్త దానం శిబిరం మరియు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను  నిర్వహించాము. మొదటిసారిగా  మేము ' హెయిర్ ఫర్ హోప్ ' ప్రచారంలో పాల్గొన్నాము. మెర్సీ వర్గీస్ సభ్యురాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కీమోథెరపీకి కారణంగా జట్టు కోల్పోయిన క్యాన్సర్ రోగుల గురించి మేము ఆలోచించామని మా  అందరికి జుట్టు ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన వచ్చింది.  మేము ఒక్కొక్కరు 17 అంగుళాల జుట్టు వరకు  దానం చేయాలని నిర్ణయించుకున్నాము. నా జుట్టు అంత పొడవైనది కాదని గ్రూప్  కార్యదర్శి జాయిస్ జాన్ పేర్కొన్నారు.   చర్చి సభ్యుల నుండి ఉత్సాహభరితమైన ప్రతిస్పందన ఉందని వారు చెప్పారు. ట్రస్టీ షీలా జాకబ్ మాట్లాడుతూ  క్యాన్సర్ రోగులు తమ జుట్టు కోల్పోవడం ఒక దుఃఖకరమైన మరియు ఇది ఒక పీడకల మాదిరిగా ఉంటుంది. వారి కోసం ఈ సాయం మా తరుపున చేయాలనుకుంటున్నాము. ఈ చొరవతో, మేము రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల మరియు 'గివింగ్ ఇయర్' రెండింటిని పాటిస్తున్నామని షీలా అన్నారు."మాలో అత్యధికులు  పొడవాటి జుట్టు కలిగి లేనందున ఈ జుట్టు దానం చేసే అవకాశం లేక  చాలామంది ఉన్నారు" అని ఆమె తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com