మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- May 05, 2024
మస్కట్: మార్చి నెలలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల జాబితాలో భారత జాతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. వచ్చిన భారతీయుల సంఖ్య 79,810, బయలు దేరిన వారి సంఖ్య 77,646 గా ఉంది. ఆ తర్వత బంగ్లాదేశ్ పౌరులు 14,469 మంది రాగా 20,909 మంది బయలుదేరారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం 24,097 మంది రాకపోకలు మరియు 20,191 మంది నిష్క్రమణలతో పాకిస్తాన్ జాతీయులు మూడవ స్థానంలో నిలిచారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య మార్చి 2024 చివరి నాటికి 16.8 శాతం పెరిగి 3,840,354 మంది ప్రయాణికులకు చేరుకుంది. ఈ సంఖ్య మార్చి 2023 చివరినాటికి 3,287,015 మంది ప్రయాణికులుగా ఉన్నది. అదే సమయంలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 17.7 శాతం పెరిగి 3,482,325కి చేరుకుందని ఎన్‌సిఎస్ఐ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..