రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు

- May 05, 2024 , by Maagulf
రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం హీటెక్కింది. ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రేపటి నుంచి రెండు రోజులు ప్రధాని మోదీ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. రాజమండ్రి లోక్ సబ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. రాజమండ్రిలో రేపు ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభకు కూటమినేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేమగిరి జాతీయ రహదారి పక్కన రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు బహిరంగ సభ జరగనుంది. గత ఏడాది ఇదే ప్రదేశంలో టిడిపి మహానాడు జరిగింది. విజయ శంఖారావం బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలిరానున్న సుమారు రెండు లక్షల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని భద్రతా సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.‌ సభా ప్రాంగణం పక్కనే ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు మూడు హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com