డెన్మార్క్ ఓపెన్ విజేత తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్..
- October 23, 2017
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. వన్‌సైడ్‌గా సాగిన ఫైనల్లో శ్రీకాంత్ 21-10,21-5 స్కోర్‌తో లీ హ్యున్‌పై విజయం సాధించాడు. తుది పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌కు ప్రత్యర్థి ఏ మాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో ఈ ఏడాది మూడో సూపర్ సిరీస్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఇండోనేషియన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఈ తెలుగుతేజం సింగపూర్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. తాజా విజయంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ శ్రీకాంత్ ముందంజ వేశాడు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







