యంగ్ హీరో తనీష్ హీరోగా 'దేశదిమ్మరి' షూటింగ్ ప్రారంభం

- October 24, 2017 , by Maagulf
యంగ్ హీరో తనీష్ హీరోగా 'దేశదిమ్మరి' షూటింగ్ ప్రారంభం

డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే వైవిధ్యభరితమైన కధాంశంతో  తెరకెక్కుతున్న ఫిల్మ్  దేశదిమ్మరి. సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తనీష్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ మొదటివారం నుంచి నెల రోజులపాటు పంజాబ్, హర్యానా, సిమ్లా తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోబోతోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com