గుట్కా కింగ్, మాణిక్‌ చంద్‌ సంస్థల చైర్మన్‌ మృతి

- October 25, 2017 , by Maagulf
గుట్కా కింగ్, మాణిక్‌ చంద్‌ సంస్థల చైర్మన్‌ మృతి

గుట్కా కింగ్, మాణిక్‌ చంద్‌ సంస్థల చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రసిక్‌లాల్‌ మాణిక్‌ చంద్‌ ధరివాల్‌(79) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. బహుళ అవయవ వైఫల్యంతో బాధపడుతూ స్థానిక వైద్యశాలలో ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మాణిక్‌చంద్‌కు భార్య, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సెప్టెంబర్‌ 4న ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ఆయన కేన్సర్‌తో బాధపడ్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మొదట బీడీ ఫ్యాక్టరీతో వ్యాపారం ప్రారంభించిన మాణిక్‌ చంద్‌ అంచలంచలుగా వివిధ పొగాకు ఉత్పత్తుల వ్యాపారాలను ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com