ఫిఫా వరల్డ్‌కప్‌కు ఇస్లామిక్ స్టేట్ బెదిరింపు

- October 25, 2017 , by Maagulf
ఫిఫా వరల్డ్‌కప్‌కు ఇస్లామిక్ స్టేట్ బెదిరింపు

వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఇస్లామిక్ స్టేట్. ఐఎస్‌కు చెందిన వఫా మీడియా ఫౌండేషన్ ట్విట్టర్‌లో ఈ బెదిరింపు సందేశాన్ని ఉంచింది. దీనికోసం అర్జెంటీనా, బార్సిలోనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ ఫొటోను వాడుకుంది. మెస్సీ రక్త కన్నీరు కారుస్తున్నట్లుగా ఫొటోను సృష్టించి.. మీరు పోరాడుతున్న రాజ్యం ఓటమెరుగనిది అని కామెంట్ పెట్టింది. ఓ ఇంటెలిజెన్స్ గ్రూప్ మంగళవారం ఈ ట్వీట్‌ను గుర్తించింది. అంతేకాదు నైకీ ఫేమస ట్యాగ్‌లైన్ అయిన జస్ట్ డూ ఇట్‌ను కాస్త మార్చి.. జస్ట్ టెర్రరిజం అన్న క్యాప్షన్‌ను కూడా ఈ ఫొటోకు పెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే ఈ వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఈ మధ్యే ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంలోనూ ఐఎస్.. పారిస్‌లో పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. 2016 యురోపియన్ చాంపియన్‌షిప్‌కు కూడా ఈ ఉగ్ర సంస్థ ఇలాగే హెచ్చరికలు జారీ చేసినా.. ఆ టోర్నీ ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా సాఫీగా పూర్తయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com