తాజ్‌మహల్ చుట్టూ ఉన్న పార్కింగ్‌పై సుప్రీంలో పిటిషన్
- October 25, 2017
తాజ్‌మహల్ చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని కూలగొట్టాలంటూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిందిగా యూపీ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. 'కారు పార్కింగ్ ప్రదేశాన్ని కూలగొట్టాలంటూ ఇచ్చిన ఆదేశాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందువల్ల ఆ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశాం' అని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఐశ్వర్యభాటి వెల్లడించారు.
కాలుష్యం కారణంగా పాడైపోతున్న తాజ్ పరిసర ప్రాంతాలను రక్షించాల్సిందిగా కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త ఎం.సీ.మెహతా వేసిన పిటిషన్ ప్రకారమే పార్కింగ్ స్థలాన్ని కూలగొట్టాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు పలు మార్గదర్శకాలను కూడా గతంలో న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి సూచించింది.
తాజ్ చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రాంతాన్ని వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్కింగ్ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







