కమల్‌పై కేసు పెట్టండి: మద్రాస్ హైకోర్టు ఆదేశం
- October 25, 2017
ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నేలవేము మొక్కను తన అభిమానులెవరూ పంచొద్దంటూ కమల్ ట్వీట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం డెంగీ వ్యాధికి విరుగుడుగా ఈ మొక్కను పంపిణీ చేస్తోంది. అలాంటి సమయంలో కమల్ చేసిన ఈ వ్యతిరేక ప్రచారం చర్చనీయాంశమైంది. కమల్‌హాసన్ చేసిన ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ క్లర్క్ జి.దేవరాజన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు కమల్‌పై కేసు నమోదు చేయాలని చెన్నై నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఏ వైద్య ప్రమాణాల ఆధారంగా కమల్ నేలవేము మొక్క గురించి ట్వీట్ చేశారో చెప్పాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ మొక్కను వాడటం వల్ల దుష్ఫలితాలు వస్తాయని కమల్ ఏ ప్రాతిపాదికన చెప్పారో స్పష్టం చేయాలని కూడా దేవరాజన్ పిటిషన్‌లో అడిగారు. ఆయన స్వతహాగా నేలవేము మొక్కను వినియోగించి.. దుష్ఫలితాలను చవిచూశారేమో చెప్పాలని పిటిషనర్ ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేకుండా కమల్ నేలవేము మొక్క గురించి ట్వీట్ చేశారని పిటిషనర్ దేవరాజన్ తప్పు బట్టారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







