దుబాయ్ మెట్రో కొత్త టైమింగ్స్
- October 25, 2017
ఎమిరేట్స్‌లో మెట్రో టైమింగ్స్ మారుతున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బుధవారం వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి రెడ్ లైన్ సర్వీసులు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఇది ఇంతకుముందు 5.30 నిమిషాలుగా ఉంది. గ్రీన్‌లైన్ సర్వీసులు 5.50 నిమిషాలకు బదులుగా, 5.30 నిమిషాలకే ప్రారంభమవుతాయి. గురువారాల్లో రెడ్ మరియు గ్రీన్ లైన్స్ తెల్లవారు ఝామున 1 గంటల వరకు పనిచేస్తాయ. శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఝామున 1 గంట వరకు పనిచేస్తాయి. ఎక్స్‌ప్రెస్ మెట్రో సర్వీసుల్ని ఆరు స్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్నారు. రషిదియా, రిగ్గా, ఎమిరేట్స్ టవర్స్, ఫస్ట్ గల్ఫ్ బ్యాంక్, జుమైరా లేక్స్ టవర్స్ అలాగే యూఏఈ మనీ ఎక్స్ఛేంజ్ నుంచి ఇవి పనిచేస్తాయి. ప్రయాణీకులు ఎక్కువగా వినియోగించే స్టేషన్లు ఇవి. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సర్వీసుల్ని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆర్టిఎ రైల్ ఏజెన్సీ రైల్ ఆపరేషన్స్ డైరెక్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







