కాకర రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని...?
- October 25, 2017కాకర కాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా వుంటుంది. కాలేయం శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ తోడ్పడుతుంది.
రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ర్పభావాలను నివారిస్తుంది. కాకర రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడపున తాగితే అనారోగ్యం దరిచేరదు. కాకర ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్ల రసాన్ని, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడపున ఒక నెల రోజులపాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది.
కాకర చెట్టు వేర్లను పేస్టులా చేసి పైల్స్ వున్నచోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకర రసం బాగా ఉపకరిస్తుంది. ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..