వీసాలో బాలిక వయస్సు మార్చి దుబాయ్ కు తరలించి... ఆపై వ్యభిచార రొంపిలోకి నెట్టారు

- October 25, 2017 , by Maagulf
వీసాలో బాలిక వయస్సు మార్చి దుబాయ్ కు  తరలించి... ఆపై వ్యభిచార రొంపిలోకి నెట్టారు

దుబాయ్: అప్పులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి  చేదోడు వాదోడుగా నీవు నిలవాలని అందుకు దుబాయిలో ఉద్యోగం నీకోసం ఎదురుచూస్తుందని ఓ అమాయక బాలికకు  కొందరు మోసగాళ్లు అనేక  మాయమాటలు చెప్పి వలలో వేసుకొన్నారు. ఆసియాలోని ఒక దేశానికి చెందిన 14 ఏళ్ల బాలిక గల్ఫ్‌లోని దుబాయ్ నగరానికి ఎంతో ఆశతో వెళ్లింది. ఆ బాలికను తరలించిన బ్రోకర్ల  మాటలను నమ్మింది. ఆ దుర్మార్గులు దుబాయ్ కు తీసుకువెళ్లి బలవంతాన వ్యభిచార వృత్తిలో దించారు. గత రెండు నెలలుగా ఆమె అక్కడ నరకం అనుభవిస్తోంది. ఈ బాలిక పడుతున్న ఇబ్బందుల గూర్చి దుబాయ్ పోలీసులకు కొందరు సమాచారం ఇవ్వడంతో మానవ అక్రమ తరలింపు నియంత్రణ దుబాయ్ విభాగపు  డైరెక్టర్ అబ్ధుల్లారహెమాన్ అల్ శార్ నేతృత్వంలో వ్యభిచారం గృహంపై ఆకస్మిక దాడి చేశారు. బాధిత బాలికకు విముక్తి కల్పించారు. ఆ బాలికతో పాటు అక్కడ ఉన్న మరికొందరు బాలికలను రక్షించగలిగారు. వ్యభిచార గృహారాన్ని నిర్వహిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహా అక్రమరవాణాకు పాల్పడుతున్న పలువురు నిందితులపై కేసులు  నమోదు చేశారు. బాలిక వయసు 24 సంవత్సరాలుగా వీసాలో తప్పుడు సమచారాన్ని పొందుపరచారని, స్వయంగా బాలిక బంధువే ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. కేసు విచారణ అనంతరం నిందితులు కఠిన శిక్షలు పడక తప్పవని దుబాయ్  పోలీసులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com