వీసాలో బాలిక వయస్సు మార్చి దుబాయ్ కు తరలించి... ఆపై వ్యభిచార రొంపిలోకి నెట్టారు
- October 25, 2017
దుబాయ్: అప్పులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి చేదోడు వాదోడుగా నీవు నిలవాలని అందుకు దుబాయిలో ఉద్యోగం నీకోసం ఎదురుచూస్తుందని ఓ అమాయక బాలికకు కొందరు మోసగాళ్లు అనేక మాయమాటలు చెప్పి వలలో వేసుకొన్నారు. ఆసియాలోని ఒక దేశానికి చెందిన 14 ఏళ్ల బాలిక గల్ఫ్‌లోని దుబాయ్ నగరానికి ఎంతో ఆశతో వెళ్లింది. ఆ బాలికను తరలించిన బ్రోకర్ల మాటలను నమ్మింది. ఆ దుర్మార్గులు దుబాయ్ కు తీసుకువెళ్లి బలవంతాన వ్యభిచార వృత్తిలో దించారు. గత రెండు నెలలుగా ఆమె అక్కడ నరకం అనుభవిస్తోంది. ఈ బాలిక పడుతున్న ఇబ్బందుల గూర్చి దుబాయ్ పోలీసులకు కొందరు సమాచారం ఇవ్వడంతో మానవ అక్రమ తరలింపు నియంత్రణ దుబాయ్ విభాగపు డైరెక్టర్ అబ్ధుల్లారహెమాన్ అల్ శార్ నేతృత్వంలో వ్యభిచారం గృహంపై ఆకస్మిక దాడి చేశారు. బాధిత బాలికకు విముక్తి కల్పించారు. ఆ బాలికతో పాటు అక్కడ ఉన్న మరికొందరు బాలికలను రక్షించగలిగారు. వ్యభిచార గృహారాన్ని నిర్వహిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహా అక్రమరవాణాకు పాల్పడుతున్న పలువురు నిందితులపై కేసులు నమోదు చేశారు. బాలిక వయసు 24 సంవత్సరాలుగా వీసాలో తప్పుడు సమచారాన్ని పొందుపరచారని, స్వయంగా బాలిక బంధువే ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. కేసు విచారణ అనంతరం నిందితులు కఠిన శిక్షలు పడక తప్పవని దుబాయ్ పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









