అమెరికాలో యాక్సిడెంట్‌కు గురైన ఖమ్మం జిల్లా తెలుగు విద్యార్ధిని శ్రీలేఖ

- October 25, 2017 , by Maagulf
అమెరికాలో యాక్సిడెంట్‌కు గురైన ఖమ్మం జిల్లా తెలుగు విద్యార్ధిని శ్రీలేఖ

అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన కొల్లూరు శ్రీలేఖ మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లింది. న్యూయార్క్ లోని స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో శ్రీలేఖ తలకు బలమైన గాయాలు అయ్యాయి. శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..

మరోవైపు శ్రీలేఖ తల్లిదండ్రులు కొల్లూరు సురేష్‌, సుమతిలు కొన్నిసంవత్సరాలుగా మధిరలోని ఆజాద్‌ రోడ్డులో నివాసముంటూ పిరమిడ్‌ ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అమెరికా అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీలేఖకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఇండియన్‌ కౌన్సిల్ అధికారులకు  విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్‌ సూచించారు. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా శ్రీలేఖకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com