నవంబర్‌లో జుమైరా జూ మూసివేత
- October 26, 2017
50 ఏళ్ళుగా అందర్నీ ఆకట్టుకుంటోన్న దుబాయ్‌లోని జుమైరా జూ నవంబర్‌లో మూసివేయబడనుంది. దుబాయ్ సఫారీ ప్రాజెక్ట్ కోసం ఈ జూపార్క్‌ని మూసివేయనున్నారు. మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా ప్రత్యేక హంగులతో సఫారీ పార్క్ ప్రాజెక్ట్‌ని చేపట్టబోతున్న కారణంగా ప్రస్తుతం ఉన్న జుమైరా పార్క్‌ని మూసివేయాల్సి వస్తోందని దుబాయ్ మునిసిపాలిటీ లీజర్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలిద్ అల్ సువైది చెప్పారు. కొత్త ప్రాజెక్ట్ ప్రాంగణంలోకి ప్రస్తుతం జుమైరా జూలో ఉన్న జంతువుల్ని తరలించనున్నట్లు ఆయన వివరించారు. దుబాయ్ సఫారీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అలాగే జుమైరా జూ మూసివేత సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నవంబర్ 5న ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమంలో ఉద్యోగులందర్నీ సన్మానించనున్నట్లు వెల్లడించారు అల్ సువైది. జూ క్లోజింగ్ సెర్మానీకి ప్రజలందరూ ఆహ్వానితులేనని, ఎలాంటి ప్రవేశ రుసుమూ వారికి ఉండబోదని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







