అమ్వాజ్ గేట్‌వే ఆక్షన్ ఎప్పుడంటే
- October 26, 2017
అమ్వాజ్ గేట్‌వే డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆక్షన్, అక్టోబర్ 31న జరగబోతోంది. బహ్రెయిన్ జ్యుడీషియల్ కమిటీ ఈ మేరకు ఆక్షన్ తేదీని ప్రకటించింది. ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి సెటిల్‌మెంట్స్ కోసం జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసినదే. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వద్ద ఉదయం 11 గంటల సమయంలో ఆక్షన్ ప్రారంభం కానుంది. 36 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ప్రారంభ ధరతో ఆక్షన్ జరుగుతుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ క్లట్టన్స్ బహ్రెయిన్ హెడ్ హారీ గుడ్సన్ వికెస్ హర్షం వ్యక్తం చేశారు. అమ్వాజ్ గేట్ వే భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నామనీ, ఇన్వెస్టర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని హారీ గుడ్సన్ వికెస్ చెప్పారు. అమ్వాజ్ గేట్‌వే 33,391 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. 190,000 చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 20 అంతస్తుల ట్విన్ టవర్స్‌లో 384 అపార్ట్‌మెంట్లు, రెండంస్థుల భవనంలో 93 టౌన్ హౌస్‌లు డిజైన్ చేశారు. ఇందులో 13 రూమ్ హోటల్ టవర్ కూడా ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







