జెబెల్‌ జైస్‌లో త్రీడీ మ్యూజికల్‌ ఈవెంట్‌

- October 27, 2017 , by Maagulf
జెబెల్‌ జైస్‌లో త్రీడీ మ్యూజికల్‌ ఈవెంట్‌

రస్‌ అల్‌ ఖైమా 
యూఏఈలో టాలెస్ట్‌ పీక్‌ అయిన జబెల్‌ జైస్‌, భారీ మ్యూజిక్‌ ఈవెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ కానుంది. అక్టోబర్‌ 27 శుక్రవారం 'వివాల్డియానో - సిటీ ఆఫ్‌ మిర్రర్స్‌' పేరుతో గ్లోబల్‌ సెన్సేషన్‌ అనదగ్గ స్థాయిలో అవార్డ్‌ విన్నింగ్‌ జెక్‌ మ్యూజీషియన్‌, ఫిలిం కంపోజర్‌ మిఖాయిల్‌ డ్వోరాక్‌తో ఈ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. సముద్రమట్టానికి 1,600 మీటర్ల ఎత్తున జరిగే ఈ అద్భుతమైన లైవ్‌ మ్యూజిక్‌ ప్రదర్శన సంగీత ప్రియుల్ని అలరించనుంది. రస్‌ అల్‌ ఖైమా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రస్‌ అల్‌ ఖైమా టూరిజం డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎకెటిడిఎ) ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. మ్యూజిక్‌ ఈవెంట్‌ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా, ఇందుకోసం జబెల్‌ జైస్‌ వైపు వెళ్ళే రోడ్డు మార్గాల్ని మూసివేస్తున్నారు. సాయంత్రం 4.30 నిమిషాలకు ఈవెంట్‌కి డోర్స్‌ ఓపెన్‌ కానున్నాయి. సాయంత్రం 6.45 నిమిషాలతో ఎంట్రీ క్లోజ్‌ అవుతుంది. కార్‌ పార్కింగ్‌ నుంచి ఈవెంట్‌ జరిగే ప్రాంతానికి ఆఖరి షటిల్‌ 6.30కి ఉంటుంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com