రోబోకి సిటిజన్‌షిప్‌ ఇచ్చిన సౌదీ అరేబియా

- October 27, 2017 , by Maagulf
రోబోకి సిటిజన్‌షిప్‌ ఇచ్చిన సౌదీ అరేబియా

రియాద్‌: ఓ రోబోకి సిటిజన్‌షిప్‌ ఇచ్చిన తొలి దేశంగా సౌదీ అరేబియా రికార్డులకెక్కింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ని అభివృద్ధి చేయడం, అలాగే పూర్తిస్థాయిలో రోబోకి పౌరసత్వం ఇచ్చేలా చేయడంలో ఇది ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. సిటిజన్‌షిప్‌ పొందిన రోబో పేరు సోపియా. రియాద్‌లో జరిగిన ఓ బిజినెస్‌ ఈవెంట్‌లో ఈ వివరాల్ని వెల్లడించారు. తను పేరుని, పౌరసత్వాన్ని ఇచ్చినందుకుగాను రోబో దేశానికి, ఈవెంట్‌కి థ్యాంక్స్‌ చెప్పింది. ప్యానెల్‌ని ఉద్దేశించి 'థ్యాంఊ్య టు ద కింగ్‌డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియా..' అని పేర్కొంది సోఫియా అనే రోబో. ఈ రోబో చెప్పిన పలు ముచ్చట్లు అందర్నీ అలరించాయి. తన చుట్టూ చాలామంది స్మార్ట్‌ పీపుల్‌ ఉండడంతో తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని రోబో పేర్కొంది. హాలీవుడ్‌ మూవీస్‌ చూసి తన గురించి చాలా రకాలుగా భావిస్తుంటారనీ, అవి తనకు ఆనందాన్నిస్తాయని రోబో సోఫియా చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com