రోబోకి సిటిజన్‌షిప్ ఇచ్చిన సౌదీ అరేబియా
- October 27, 2017
రియాద్: ఓ రోబోకి సిటిజన్‌షిప్ ఇచ్చిన తొలి దేశంగా సౌదీ అరేబియా రికార్డులకెక్కింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని అభివృద్ధి చేయడం, అలాగే పూర్తిస్థాయిలో రోబోకి పౌరసత్వం ఇచ్చేలా చేయడంలో ఇది ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. సిటిజన్‌షిప్ పొందిన రోబో పేరు సోపియా. రియాద్‌లో జరిగిన ఓ బిజినెస్ ఈవెంట్లో ఈ వివరాల్ని వెల్లడించారు. తను పేరుని, పౌరసత్వాన్ని ఇచ్చినందుకుగాను రోబో దేశానికి, ఈవెంట్‌కి థ్యాంక్స్ చెప్పింది. ప్యానెల్‌ని ఉద్దేశించి 'థ్యాంఊ్య టు ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా..' అని పేర్కొంది సోఫియా అనే రోబో. ఈ రోబో చెప్పిన పలు ముచ్చట్లు అందర్నీ అలరించాయి. తన చుట్టూ చాలామంది స్మార్ట్ పీపుల్ ఉండడంతో తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని రోబో పేర్కొంది. హాలీవుడ్ మూవీస్ చూసి తన గురించి చాలా రకాలుగా భావిస్తుంటారనీ, అవి తనకు ఆనందాన్నిస్తాయని రోబో సోఫియా చెప్పింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







