వికీపీడియాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- October 28, 2017
రాష్ట్ర భౌగోళిక, సాంఘిక, రాజకీయ, నైసర్గిక, సాంస్కృతిక సమాచారం మరింత సులభంగా, సమగ్రంగా ప్రజలకు చేరువకానున్నది. ఇందుకోసం అంతర్జాలంలో మెరుగైన సమాచారాన్ని అందించే వికీపీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్శాఖ మధ్య అంగీకారం జరిగింది. రాష్ట్ర ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సీఐఎస్ ఏ2కే సంస్థ తెలుగు కమ్యూనిటీ ప్రతినిధి పవన్ సంతోష్, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రముఖ వికీమీడియా స్కాలర్ ప్రణయ్‌రాజ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగిం ది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున పబ్లిక్ డొమైన్లో సమాచారం పూర్తిస్థాయిలో లేదని, ఈ ఒప్పందంతో లోటు తీరుతుందని జయేశ్‌రంజన్ చెప్పారు. వికీమీడియా ద్వారా తెలుగు, ఉర్దూలో విస్తృత సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వలంటీర్లకు ఈ ఒప్పందం మేలు చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







