భారీ ఫైన్ తో షాక్ లో ఉన్న లావణ్య
- October 30, 2017
హీరోయిన్ లావణ్య లావణ్య త్రిపాఠికి భారీ ఫైన్ పడింది, లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన '100%లవ్' చిత్రాన్ని తమిళంలో '100% కాదల్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది.
దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. కానీ అప్పటికే నిర్మాతలకు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. దాంతో లావణ్యపై ఆ రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాలు అంటున్నాయి. మరోపక్క ఈ చిత్రంలో కథానాయికగా 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలిని పాండేను ఎంపికచేసుకున్నారు. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్ హీరో.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







