భారతీయ బాలుడిపై పాకిస్థాన్ కాముకుడి లైంగిక దాడి..
- October 31, 2017
దుబాయ్: కొందరు ప్రవాసీయులు పరాయి దేశం వెళ్ళి పైత్యపు కామవికారపు పనులు చేసి వారి వారి దేశాలకు అపకీర్తి మరింతగా మూట కడుతున్నారు..ముఖ్యంగా పాకిస్తానీయులు పాపపు పనుల్లో ప్రధమ స్థానంలో ఉండటం గమనార్హం...వీరిలో కొందరి ఆగడాలకు మగపిల్లలు సైతం దైర్యంగా వీధులలో సైతం తిరగలేకపోతున్నారు. పాకిస్తాన్కు చెందిన ఓ కామాంధుడు భారతదేశానికి చెందిన 16 ఏళ్ల బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఓ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న బాలుడితో మాట కలిపేడు. అలా కారులో షికారుకు వెళదామని బాలుడిని నమ్మించాడు. దాంతో మాయామర్మం తెలియని ఆ కుర్రోడు ఠకీమని కారు ఎక్కి కూర్చొన్నాడు. . కారు డోర్ లాక్ చేసిన తర్వాత నిందితుడు బాలుడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అకస్మాత్తుగా బాలుడిని మీదకు లాక్కొని పెదవులపై ముద్దుపెట్టాడు. అనంతరం బాలుడి శరీర భాగాలపై అసభ్యకరంగా చేతులతో తడిమాడు. ఈ చర్యలతో గజ గజ వణికిపోయింది బాలుడు కారు డోర్ తెరిచి కిందకు దిగే యత్నం చేశాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడి ఇళ్లు సమీపించడంతో బాలుడిని ఇంటి వద్ద వదిలాడు. ఈ విషయాన్ని బాధిత బాలుడు తండ్రికి భోరున విలపిస్తూ తెలియజేశాడు. ఈ ఘటనపై బాలుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో నేరం రుజువైంది. దీంతో నిందితుడికి కోర్టు శిక్షవిధించాల్సి ఉంది. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్ నగరంలో జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







