వరంగల్ పార్లమెంట్ స్థానానికి 23 మంది అభ్యర్థులు
- November 07, 2015
వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజైన శనివారం 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు పసునూరి దయాకర్ (టీఆర్‌ఎస్), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), నల్లా సూర్యప్రకాశరావు (వైఎస్సార్‌సీపీ), దేవయ్య (ఎన్డీఏ) , వినోద్ కుమార్ (వామపక్షాలు) పోటీపడుతున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన విజయరామారావు, కొండేటి శ్రీధర్, రాజారపు ప్రతాప్, బొచ్చు సమ్మయ్య నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. కోడలు, మనవళ్ల మృతి నేపథ్యంలో పోటీ నుంచి వైదొలగిన విషయం విదితమే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







