ఆర్నాల్డ్ ను కలవనున్న రజని
- November 07, 2015
హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్‌ను కలుసుకునేందుకు దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ అమెరికా వెళ్లబోతున్నారన్న వార్త కోలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారింది. 'రోబో-2'ని హాలీవుడ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. విలన్ పాత్రలో ఆర్నాల్డ్‌ను నటింపజేయాలని శంకర్, నిర్మాణ సంస్థ లైకా తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, పారితోషకం, కాల్షీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కబాలి' షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లిన రజనీకాంత్ ఈ నెలాఖరులో అమెరికా వెళ్లి ఆర్నాల్డ్‌ను కలువబోతున్నారన్న కథనాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. రజనీకాంత్‌తోపాటు శంకర్ కూడా యు.ఎస్.కి వెళ్లబోతున్నారట. వీరి చర్చలు ఫిలించి హాలీవుడ్ సూపర్‌స్టార్ రోబో-2లో నటించడానికి అంగీకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







