నవంబర్ 20న మొదలుకానున్న నాగ్-వర్మ మూవీ
- November 01, 2017
కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం ఖరారైంది. స్వయంగా వర్మ ఫేస్‌బుక ద్వారా ఈ శుభవార్తను షేర్ చేశారు. నవంబర్ 20 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వివరించారు. అంతేకాదు ఈ మాట చెప్పడానికి తనకు చాలా భావోద్వేగానికి లోనవుతున్నట్టు చెప్పారు.
నాగ్ తో తీసిన శివ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నవంబర్ 20న ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ మూవీ ఏప్రిల్‌కు రిలీజ్ కానుందని టాలీవుడ్ టాప్ పీఆర్వో బీఏ రాజు ట్విట్టర్‌ద్వారా మరో హింట్ ఇచ్చారు.
కాగా వర్మ తాజా ట్వీట్‌తో ఈ మూవీకి ‘శివ-2’ టైటిల్ ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. ద డెడ్లీ కాంబో ఈజ్‌బ్యాక్ అంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మరోవై పు నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటించనున్నారనేది టాలీవుడ్ టాక్. అలాగే ఈ మూవీలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అయితే మూవీ టైటిల్, రిలీజ్ డేట్, నటీ నటులు లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ నెల 20 వరకు సస్పెన్స్ తప్పదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







