మిస్టర్ ఇండియా సినిమా సీక్వెల్ తో శ్రీదేవి కూతురు ఎంట్రీ

- November 02, 2017 , by Maagulf
మిస్టర్ ఇండియా సినిమా సీక్వెల్ తో శ్రీదేవి కూతురు ఎంట్రీ

అతిలోక సుందరి శ్రీదేవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి మిస్టర్ ఇండియా... బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ సినిమా శేఖర్ కపూర్ దర్శకత్వంలో 1987 లో రిలీజైంది. అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమాలో శ్రీదేవి అందాలు.. అనిల్ కపూర్ యాక్షన్, అమ్రిష్ పురి.. "మొగాంబో" అంటూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అనిల్ కపూర్ ఇమేజ్ ని ఛేంజ్ చేసిన ఈ సినిమా కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు శ్రీదేవి భర్త.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. కాగా ఈ సీక్వెల్ లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించనున్నట్లు బీ టౌన్ వర్గాల టాక్. ఈ సినిమాతో జాన్వి తెరం గ్రేటం చేయనున్నట్లు టాక్. మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి పాత్రలో జాన్వి ని ఎంపిక చేసుకొనున్నట్లు.. తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉన్నది. అంతేకాదు.. శ్రీదేవి గెస్ట్ రోల్ లో కనిపించనున్నదట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com