ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- September 21, 2025
దోహా: ఖతార్ లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ అధిపతి, ఇంజినీర్ మొహమ్మద్ ఖలీద్ అల్ షర్షానీ ప్రకటించారు. తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ మొబిలిటీని పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ యాప్ ద్వారా వినియోగదారులు ఛార్జింగ్ స్టేషన్ స్థానాలు, ఛార్జింగ్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం, ఛార్జింగ్ స్టేషన్లు దోహా మరియు ఉత్తర ఖతార్‌లో విస్తృతంగా ఉన్నాయని, రాబోయే దశల్లో పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాలలో విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రజా డిమాండ్ మేరకు ఈవీ మౌలిక సదుపాయాలను విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







