10 వేల సోషియల్ మీడియా అకౌంట్లు మూసివేసిన దుబాయ్ పోలీసులు
- November 02, 2017
దుబాయ్: ' కొండ నాలికను మందు వేస్తే ...ఉన్న నాలిక ఊడి పోయిందని ' సోషల్ మీడియా ద్వారా పలు నేరాల సంఖ్య అధికమవుతుండడంపై దుబాయ్ పోలీసులు 10 వేల సోషల్ మీడియా అకౌంట్లు మూసివేశారు దుబాయ్‌లోని ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎమిరేట్స్, యూనియన్ కోఆపరేటివ్ సోసైటీ, జువైనల్ అవేర్నెస్ అండ్ కేర్ అసోషియేషన్, స్పోర్ట్స్ క్లబ్స్ అండ్ సోషల్ క్లబ్స్ ఆఫ్ ఫారెన్ కమ్యూనిటీస్ అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల గురించి అవగాహన సామాజిక మాధ్యమాలలో జాగ్రత్తలు పాటించవలసిన విధానాలను తెలిపారు. ముఖ్యంగా కొత్త వ్యక్తులను ఏమాత్రం నమ్మవద్దని, అలాంటివారితో స్నేహాలకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు. ఈ సందర్భంగా 2017 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వివిధ నేరాలకు కారణమైన, సంబంధమున్న దాదాపు 10,000 సోషల్ మీడియా అకౌంట్లను మూసివేశారు. ప్రజలు సైబర్ నేరాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్య చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ అవగాహాన కార్యక్రమంలో దుబాయ్ నగర అధికారులు మహమ్మద్ అఖ్వీల్ అహ్లీ, బుట్టీ మ్మద్ బిన్ దర్విష్, ఘయా సుల్తాన్ అల్ ముహిరి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







